Saturday 18 July 2015

ఈ పంజాబీ రైతు పంటలు పండించడు - కరెంటు పండిస్తాడు!

భాగ్సార్‌, జూలై 18: ఆయనో సాధారణ పంజాబీ రైతు. పోయింది పోగా మిగిలిన భూమి కేవలం 12 ఎకరాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట వేయడం, వరదలు రావడంతో ఆ పంట మొత్తం నీళ్లపాలు కావడం, మళ్లీ ఏదో ఒకటి చేసి మళ్లీ పంటవేయడం... ఇదీ ఏటా జరిగే తంతు. ఇక లాభం లేదనుకున్నాడు జగ్‌దేవ్‌ సింగ్‌. ఇక పంటలు వేయడం మానేసి, తన భూమిని సౌర విద్యుత్‌ ఉత్పాదనకు వినియోగించుకోవాలని సింగ్‌ నిర్ణయించుకున్నాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ సోలార్‌ మిషన్‌ క్రింద సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన రోజుకు 5500 యూనిట్ల సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వేసవి కాలంలో అయితే ఈ మొత్తం ఉత్పత్తి దాదాపు పదివేల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

సింగ్‌ గారి దగ్గరనుంచి పాతికేళ్లపాటు విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు పంజాబ్‌ ప్రభుత్వం కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి రూ. 17.90కి విక్రయించే జగ్‌దేవ్‌ సింగ్‌ అదే కరెంటును రూ.8.40కే విక్రయిస్తాడు. ఒకానొకనాడు భూమిని కాపాడుకోవడం ఎలారా భగవంతుడా అనుకున్న జగ్‌దేవ్‌ సింగ్‌ ప్రస్తుతం అదే భూమిని నమ్ముకుని రోజకి సుమారు రూ.50వేలు సంపాదిస్తున్నాడు! అందుకే ముక్త్‌సార్‌ జిల్లావాసులు జగ్‌దేవ్‌ సింగ్‌ గురించి ఆయన పంటలు పండించడు... కరెంటు పండిస్తాడు.. అని ప్రేమతో ప్రశంసిస్తున్నారు.
Courtesy  with Andhra Jyothi Daily

No comments:

Post a Comment