Friday 7 March 2014

వెన్నుపై ఒత్తిడి పెంచే 'స్పాండిలోలిస్తెసిస్‌'



      







క్రీడాకారుల్లో కొంతమందికి వెన్ను కింది భాగంలో నొప్పి వస్తుంటుంది. తర్వాత ఎక్స్‌రే తీయిస్తే వెన్ను పూసలో ఒకదానిలో ప్రాక్చర్‌ కనిపి స్తుంది. ఇలా వెన్ను పూసలో ఒకటి విరగడాన్ని, 'స్పాండిలోలైసిస్‌' అంటారు. సాధారణంగా ఫ్రాక్చర్‌ నడుము కింది భాగంలోని ఐదవ లుంబార్‌ వెన్నుపూసలో అవుతుంది. ఇలా జరిగిన వెన్నుపూసల మీద పైనుంచి భారం పడటంతో ఇది పక్కకు కదులుతుంది. ఈ స్థితిని 'స్పాండిలోలిస్తెసిస్‌' అంటారు. మరికొంచెం పక్కకు కదిలితే ఈ వెన్నుపూస నరాలమీద ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. శస్త్ర చికిత్సతో ఈ స్థితిని సరిచేయాల్సి ఉంటుంది.
ఎవరిలో వస్తుంది?
స్పాండిలోలిస్తెసిస్‌ వంశపారం పర్యంగానూ వస్తుంది. వెన్నుపూసలు పల్చగా ఉన్నవాళ్లల్లో కూడా వెన్నెముక ఇలా విరగే అవకాశం ఉంటుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ చేసే వాళ్లకు, ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లకు, జిమ్నాస్టిక్స్‌ లోనూ వెన్ను కింది భాగంలోని పూసల మీద ఒత్తిడి ఎక్కువ వుతుంది. స్ట్రెస్‌ కలుగుతుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్లల్లో నొప్పి నడుం కింది భాగంలో కనిపించడంతో కండరాల నొప్పి అనుకుంటారు. స్పాండిలోలిస్తెసిస్‌ వల్ల స్పాజమ్‌ ఏర్పడి, నడుం కిందిభాగం స్టిఫ్‌ అవుతుంది. దాంతో ఫ్రాక్చర్‌లోనే మార్పు వస్తుంది. వెన్నుపూస ఎక్కువగా పక్కకు జరగడంతో నరాల మీద ఒత్తిడి కలుగు తుంది. వెన్నుపూసల మధ్య నరాలు విస్తరించడానికి ఉండే దారి స్పైనల్‌ కెనాల్‌ సన్నమవుతుంది.సిటీస్కాన్‌ గానీ, ఎంఆర్‌ఐగానీ తీయించి, పరిస్థితిని సరిగ్గా తెలుసు కోవచ్చు. ఉన్న తేడాను బట్టి చికిత్స ఎలా చేయాలో నిర్ణయిస్తారు. ఎందుకు స్పాండిలోలైసిస్‌ వచ్చిందో తెలుసుకోవ డానికి వాటిని ఆపేయాలి. ఇబుప్రాఫెన్‌ లాంటి యాంటి ఇన్‌ప్లమేటరీ మందుల్ని నొప్పి తగ్గడానికి వాడతారు. అవసరమైతే నడుం కింది భాగంలో బెల్టు పెట్టుకోమంటారు. ఫిజియోథెరపీ చేయమంటారు. స్ట్రెచ్చింగ్‌, స్ట్రెనైనింగ్‌ ఎక్సర్‌ సైజెస్‌తో నడుం కింది భాగంలో నొప్పిని పోగొట్టడమేగాక, భవిష్యత్తులో నొప్పి కలగకుండా కాపాడవచ్చు. ఎక్స్‌రేలు వరుసగా తీయిస్తూ వెన్ను పూసల స్థితిని తెలుసుకోవచ్చు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. వెన్నుపూస, శాక్రమ్‌లను ప్యూజ్‌ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి లోపల స్క్రూస్‌, రాడ్స్‌ పెట్టి ప్యూజన్‌ చేయాల్సి రావచ్చు. శస్త్ర చికిత్సతో స్వస్థత చేకూరుతుంది.
మెడనొప్పి
మెడనొప్పితో చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని మిగతా భాగాలలాగే మెడలోని సర్వైకల్‌ స్పైన్‌లో ఎముకలు వయస్సుతోపాటు క్రమంగా అరుగుతాయి. ఆర్థరైటిస్‌తో లిగమెంట్స్‌కు, డిస్క్‌కు, సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వెన్నుపాములోని పూసల మధ్య నరాలు ప్రయాణించడానికి వీలుగా ఉన్న నాళం సన్నమై, నరాలమీద ఒత్తిడి పడుతుంది. దీనిని స్టినోసిస్‌ అంటారు. ఇది మెడ ప్రాంతంలోనూ కలుగ వచ్చు. దెబ్బల వల్ల వెన్నుమీద ఒత్తిడి కలుగుతుంది. ఈ మెడనొప్పి కొద్దిపాటి నుంచి తీవ్రస్థాయి వరకూ ఉండవచ్చు. మెడ నిలపడమే కష్టమైపోతుంది.
లక్షణాలు
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌తో నొప్పి మాత్రమేగాక, మెడ కూడా బిగుసుకుపోతుంది. ఆ నొప్పికి పైభాగాన భుజాలలో కూడా వ్యాపించవచ్చు. ఏదైనా పనిచేస్తుంటే నొప్పి తీవ్రతరం అవుతుంది. చేతుల్లో నీరసం, మొద్దుబారినట్లు ఉంటుంది. అరచేతులకూ, వేళ్లకూ నొప్పి వ్యాపించవచ్చు. కాళ్లల్లో నిస్సత్తువ ఏర్పడి, నడవటం కష్టమవుతుంది. మెడను కదిలిస్తున్న ప్పుడు శబ్దమవ్వొచ్చు. మెడనొప్పితో మెడ కండరాలు పట్టుకోవడం, తలనొప్పి రావడం జరగొచ్చు. ఈ లక్షణాలతో అసహనం పెరుగుతుంది. అలసటా కలుగుతుంది. నిద్రాభంగం అవుతుంది. పనిచేయలేని స్థితి కలుగవచ్చు.
పరీక్షలు
మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు రోగి తన వైద్య చరిత్రను డాక్టర్‌కు చెప్పాలి. ఈ సమాచారంతో
డాక్టర్‌ సర్వైకల్‌ స్పాండిలో సిస్‌తోగాక, మరేదైనా కారణంతో ఈ నొప్పి వస్తున్నదేమో తెలుసు కోగలరు. భౌతిక పరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఇతర ఇమేజింగ్‌ పరీక్షలతో మెదడు ప్రాంతంలోని వెన్ను పరిస్థితిని తెలుసుకోవచ్చు. మెడలో సరిగ్గా ఏ ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉందో వైద్యుడికి చెప్పగలగాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైందో, క్రమంగా పెరుగు తున్నదా? తగ్గుతున్నదా? లేక అలాగే ఉంటున్నదా? అనే విషయాలు చెప్పాలి.
చికిత్స
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఉంటే ఈ లక్షణాలు నెలల కొద్దీ బాధించవచ్చు. లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే మందులు, ఫిజయోథెరపీ లాంటి వాటితో చికిత్స చేస్తారు. నొప్పి తీవ్రంగా ఉంటే మెడలోని వెన్ను దెబ్బ తింటే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. డిస్క్‌ను తీసివేయడం వంటి చికిత్స చేస్తారు.
రాడిక్యులోపతి
నరాల మొదట్లో తగిలిన దెబ్బతో నరాల చివర నొప్పి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ స్పర్శజ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు వెన్నుపూసల్లో, డిస్క్‌ ఇబ్బంది కలిగితే చేతుల్లో, భుజాల్లో, మణికట్టులో జాలు వారడం, నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి. మెడలోని వెన్నులో ప్రారంభమైన నరాలు చేతుల్లోకి వ్యాపిస్తాయి. కనుక నొప్పి చేతుల్లోకి వ్యాపిస్తుంది. చాలా కారణాల వల్ల మెదడులోని, వెన్నులోని నరాలపై ఒత్తిడి పడుతుంది. ఈ సర్వైకల్‌ రాడిక్యులోపతికి కారణాలు మెడ ప్రాంతంలోని వెన్ను డిస్క్‌లో దెబ్బతినడంతో లోపలి నరాలపై ఒత్తిడి పడుతుంది. వెన్ను లోపలి నరాలు విస్తరించే దారి సన్నం కావడంతోనూ నరాలపై ఒత్తిడి పడుతుంది.
డిస్క్‌ డీ జనరేషన్‌తో నొప్పి రావచ్చు. మెదడును కదిలించి, నొప్పి ఎక్కడ ఎలా వస్తుందో తెలుసుకుంటారు. ఎక్స్‌రేతో డీజనరేటివ్‌ డిస్క్‌లను పసిగట్టవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ పరీక్ష చేయిస్తారు. ముందు మందులు ఫిజియోథెరపీతో వెన్ను నరాల మీద ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తారు. విశ్రాంతితో కొన్నిరోజులు మెడకు కాలర్‌ వేసుకుంటారు. సర్వైకల్‌ ట్రాక్షన్‌గానీ, మరేదైనా వ్యాయామంగానీ వైద్యులు సూచించిన ప్రకారం ఫిజియోథెరపిస్టు చెప్తారు. కోల్డ్‌ థెరపీ, ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌, ఐసోమెట్రిక్‌-స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయించవచ్చు. ఆరు నుంచి 12 వారాలలోపు తగ్గకపోతే శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
డాక్టర్‌ మాధవ్‌ యెండ్రు,
స్పైన్‌ సర్జన్‌, 
లక్డీకాపూల్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.
ఫోన్‌: 9963022274

No comments:

Post a Comment