Tuesday 4 February 2014

ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేయడం కూడా మంచిది కాదా?


                          ప్లాస్టిక్‌ వస్తువులతో ఉన్న అతి పెద్ద తలనొప్పి ఏమిటంటే - వాటిని వాడి మనం పారేసినప్పుడు అవి తిరిగి నేలలో 'కలిసిపోవడానికి' కొన్ని వేల నుంచి లక్ష సంవత్సరాల కాలం పడుతుంది. వాటిని కాల్చగా మిగిలిన పదార్ధం కూడా నేలలో అంత సులభంగా కలవదు. పైగా ప్లాస్టిక్‌ వస్తువులను కాల్చేటప్పుడు అనేక విష రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది మనుషుల ఆరోగ్యం విూద మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి వాడిన గాజు, కాగితం, ఇనుము వంటి ఎన్నో పదార్ధాలను ఫ్యాక్టరీలలో 'రీసైకిల్‌' చేసి, తిరిగి ఆ పదార్ధాలతో తÄయారయ్యే వస్తువులను చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడం నేడు సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్‌ వస్తువులను కూడా ఇలా రీసైకిల్‌ చేసి తిరిగి ఆ పదార్ధంతో కొత్తగా వస్తువులను తÄయారుచేస్తున్నారు. అయితే ఇతర వస్తువులను రీసైకిల్‌ చేసినప్పుటి కన్నా ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేసినప్పుడు చాలా హెచ్చు మోతాదులో విష రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఉదాహరణకు ఒక గాజు వస్తువును రీసైకిల్‌ చేసినప్పటి కన్నా, ఒక ప్లాస్టిక్‌ వస్తువును రీసైకిల్‌ చేసినప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ మోతాదులో అనేక కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. వీటిలో క్యాన్సర్‌కి కారణమయ్యే బెంజీన్‌ వంటి మహా ప్రమాదకరమైన పదార్ధాలు కూడా ఉంటున్నాయి.
అంతేకాదు, ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేసిన ప్రతిసారి ఆ పదార్ధపు నాణ్యత మరింతగా తగ్గిపోతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంది. నేడు బజారులో కన్పించే అతి పలుచని క్యారీబ్యాగ్‌లు (ప్లాస్టిక్‌ సంచులు), రకరకాల చౌకబారు ప్లాస్టిక్‌ వస్తువులు ఈ తరహా ప్లాస్టిక్‌తో తÄయారయ్యేవే. ఇలాంటి చౌకబారు ప్లాస్టిక్‌ కవర్లలోను, బాటిళ్ళలోనూ ఉంచిన చెట్నీలు, సాంబారు, కూరలు, పళ్ళ రసాలు, ఇతర ఆహార పదార్ధాలు ... ఆయా కవర్లలోని సీసం, పాదరసం, కాడ్మియం వంటి విషపదార్ధాలతో రసాయనిక చర్య జరిపి ఆయా ఆహార పదార్ధాలను విషపూరితం చేస్తాయి. అందుకే ప్లాస్టిక్‌ కవర్లలోను, సీసాలలోనూ నిల్వఉంచే ఎటువంటి ఆహారపదార్ధాన్ని వాడవద్దని, అసలు ప్లాస్టిక్‌ వస్తువులనే వాడవద్దని ఆరోగ్యవేత్తలు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులను మనం వాడటం మానేస్తే రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో తÄయారుచేసిన వస్తువులు కూడా క్రమంగా కనుమరుగవుతాయి.

Courtesy with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment