Friday 17 January 2014

                    కరెంట్‌ ఖర్చు తగ్గాలంటే...
 



        






                               విద్యుత్తును ఆదా చేస్తే, ఆ మేరకు ఉత్పత్తి చేసినట్లే! విద్యుత్తును ఆదా చేసే మన చేతుల్లోనే ఉన్నాయి.
- అవసరమైన సామర్థ్యం ఉన్న ఫ్రిజ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. దీని వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
- ఫ్రిజ్‌ను సూర్యరశ్మికీ, వేడిని వెలువరించే గ్యాస్‌ పొయ్యికీ, ఇతర పరికరాలకూ దూరంగా అమర్చుకోవాలి. కండెన్సర్‌ కాయిల్స్‌ను ప్రతి మూడు నెలలకోసారి శుభ్ర పరచుకోవాలి.
- ఫ్రిజ్‌ తలుపులు తరచూ తెరవకూడదు. ఒక వేళ తెరిచినా, ఎక్కువ సేపు అలా ఉంచకూడదు. వేడి వస్తువుల్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
- ఫ్రిజ్‌లు, ఏ.సి.లు, ఫ్యాన్లు, విద్యుత్‌ బల్బ్‌లను కొనేటప్పుడు తక్కువ విద్యుత్‌తో నడిచే నక్షత్రం గుర్తు కలిగిన వాటిని ఎంచుకోవాలి. దీనివల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌ విడుదల కాకుండా చూసుకోవచ్చు.
- ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ కన్నాసాధారణ ప్రెషర్‌ కుక్కర్‌ వాడడం మంచిది.
- నక్షత్రం గుర్తు కలిగి ఉన్న డిష్‌ వాషర్‌ ( గిన్నెలను శుభ్రపరిచే మిషన్‌ )ను వాడడం ద్వారా 25 శాతం మేర విద్యుత్తును ఆదాచేయవచ్చు.
- డిష్‌వాషర్‌ను పూర్తి సామర్థ్యం మేరకు వాడుకోవాలి. ఎందుకంటే చాలా విద్యుచ్ఛక్తి నీటిని వేడి చేయటం కోసమే వినియోగమవుతుంది.
- ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌ బదులు సోలార్‌ వాటర్‌ హీటర్‌ను వాడినట్లయితే 25 శాతం మేర గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ వాయువులు విడుదల కాకుండా చేయవచ్చు.
- వాటర్‌ హీటర్‌ను పంపుకు సాధ్యమైనంత దగ్గరగా బిగించుకోవాలి. అలాగే, తక్షణం నీటిని వేడిచేసే హీటర్‌ను వాడి విద్యుచ్ఛక్తిని ఆదా చేయవచ్చు.
- వాటర్‌ హీటర్‌తో నీటిని వేడి చేస్తున్నప్పుడు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌ను తగ్గించి, థెర్మోస్టాట్‌ను సెట్‌ చేయడం వల్ల చాలా విద్యుత్తును పొదుపు చేయవచ్చు.
- ఇస్త్రీపెట్టెలను కొనేటప్పుడు అవసరానికి తగ్గట్లు ఉష్ణోగ్రతను తనంతట తాను నియంత్రించుకునే ఇస్త్రీ పెట్టెలను తీసుకోవాలి.
- పగటి వేళ వెలుతురు కోసం సాధ్యమైనంత మేరకు విద్యుత్తు వాడకాన్ని తగ్గించి, సూర్యకాంతిని వాడుకోవాలి.
- సాధారణ బల్బులకు బదులు సి.ఎఫ్‌.ఎల్‌ బల్బులను వాడడం వల్ల తక్కువ విద్యుత్తు వినియోగం అవుతుంది. 
Courtesy with: PRAJA SEKTHI DAILY 
    ఆరు తరాల శిల్పకళా కుటుంబం



                    అరవై నాలుగు కళల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతిదీ గొప్పదే. కళ కూడా అందరికీ అబ్బదు. కళ పట్ల అభిరుచి ఉండాలి. నేర్చుకోవాలన్న పట్టుదల, నిరంతర కృషి ఎంతో అవసరం. ఏ కళనైనా ఒంటబట్టించుకోవాలంటే సంబంధిత కళ గురించి అధ్యయనం చేయాలి. నిరంతర సాధన చేయాలి. కాలానుగుణంగా మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. ఇవన్నీ తానెంచుకున్న కళలో ఇముడ్చుకొని ముందుకు పోగలిగితేనే కళాకారులుగా రాణింపునకు వస్తారు. కళలో రాణింపునకు వచ్చేవారు చాలామంది ఉండవచ్చు. కానీ ఉన్నత శిఖరాలకు చేరుకునేవారు కొద్దిమందే ఉంటారు. 64 కళల్లో ఒకటైన శిల్పకళకు విశేష ప్రాచుర్యం తీసుకురావడానికి ఆరు తరాలుగా ఆ కుటుంబం చేసిన కృషి నిరుపమానం. సుమారు 250 ఏళ్ల నుంచీ ఈ వృత్తికి అంకితమై ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న ఆ శిల్ప కళా కుటుంబంలో ఐదు, ఆరోతరం ప్రతినిధులుగా ముందుకొచ్చారు - కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్ర. గుంటూరుజిల్లా, తెనాలికి చెందిన వీరు ప్రయోగాలతో విగ్రహాల రూపకల్పనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాలానుగుణమైన శిల్పకళా రీతులను సమాజానికి పరిచయం చేస్తున్నారు. ఈ రంగంలో విశేష కృషి చేస్తున్న కాటూరి వెంకటేశ్వరరావుతో 'జీవన' మాటామంతీ... 
''మాది ఆరు తరాల వారసత్వం.. మా తాత చంద్రయ్య తన కాలంలో తెనాలిలో మార్వాడీ గోపురం కట్టడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారట! మా తాతకు ముందు ఆయన తండ్రి వెంకటసుబ్బయ్య, ఆయన నాన్న యానాది ఈ శిల్పకళను కొనసాగిస్తూ వచ్చారని చంద్రయ్య తాత చెప్పగా తెలిసింది. మా నాన్న వెంకటేశ్వర రావు ద్వారా నేనీ వృత్తిని నేర్చుకున్నా. నా ద్వారా మా అబ్బాయి రవిచంద్ర కూడా ఈ రంగంలోకి వచ్చాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మా తరాలలోనూ శిల్పకళ మారుతూ వచ్చింది. మా ముత్తాతలు, తాతలు ప్రధానంగా దేవాలయాలు, గోపురాలు నిర్మించడమేగాక వాటిపై శిల్పాలు మలిచేవారు. ఓసారి ప్రకాశం జిల్లా టంగుటూరులో వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు జీర్ణోద్ధరణకు చేయాల్సి రావడంతో మా తాతగారికి పిలుపొచ్చింది. వాటి మరమ్మతులు తాత గారితో చేయించారు. అప్పుడు తెలిసింది - మాకు అవి మా ముత్తాతలు కట్టిన గోపురాలని. అందు వల్లనే తాతను పిలిపించి వాటిని పునరుద్ధరించారని. 
ఇలా ఈ కళ అనేక తరాల నుంచి మాకు వారస త్వంగా వస్తోంది. తెనాలిలో స్థిరపడిన నాన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 500 దేవాలయాలను నిర్మించారు. నా చదువు తొమ్మిదో తరగతితో ఆగి పోవడంతో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. 
దేవాలయాలపై శిల్పాల తయారీ పనిని మా నాన్నే నేర్పారు. తెనాలిలో కన్యకాపరమేశ్వరి గాలిగోపురం, అష్టలక్ష్మీ దేవాలయం నేనే నిర్మించాను. తెనాలిలోని ప్రసిద్ధ దేవాలయాలు, గాలి గోపురాలు, వాటిపై శిల్పాలన్నీ మా తాత, నాన్న, నేను నిర్మించినవే. ఆ తర్వాత నా దృష్టి కాంస్య విగ్రహాల తయారీ మీద పడింది. కాంస్య విగ్రహాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అంచ రాధాకృష్ణమూర్తి (బోడపాడు) వద్ద శిక్షణ పొందాను. అక్కణ్ణుంచి కాంస్య విగ్రహాలతోపాటు, పంచలోహ, ఉత్సవ విగ్రహాల్ని తయారుచేయడం ప్రారంభించాను. గత 30 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నా. వేల విగ్రహాలు నా చేతి మీదుగా రూపుదిద్దుకున్నాయి. నే చేసిన ఎన్నో విగ్రహాలు రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రుల చేతుల మీదుగా ఆవిష్కృతమయ్యాయి. విగ్రహాల తయారీ రొటీన్‌ కావడంతో... ఈ రంగంలో ఏదైనా కొత్తదనం ప్రవేశపెట్టాలని నా మనసు ఉవ్విళూరుతుండేది. ఏదైనా వ్యర్థ పదార్థంతో విగ్రహాలు తయారుచేస్తే అన్న ఆలోచనతో ఇనుప తుక్కుతో తయారుచేశా. 
సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌లో పర్యావరణ సదస్సు జరుగుతోంది. కాబట్టి పర్యావరణానికి హాని కలిగించే తుక్కుతో సింహం బొమ్మను తయారు చేయడం ప్రారంభించా. దీనికి సుమారు రెండు వేల ఐరన్‌ పనిముట్లు - అంటే సైకిల్‌ చైన్లు, చైన్‌ వీల్స్‌, పెడల్స్‌ (స్క్రాప్‌)తో, దాదాపు ఐదారు వేల వెల్డింగులతో సింహరాజం విగ్ర హం తయారుచేశా. అద్భుతంగా వచ్చింది. గుర్రం కూడా ఇలాగే చేస్తే ఎలా ఉంటుందీ అను కున్నా. దీనికి ఐదు వేల రబ్బరు వాషర్లతో పని మొదలెట్టా. ఈ విగ్రహానికి 20 వేల వెల్డింగులు చేయాల్సి వచ్చింది. దీన్ని తయారు చేయడానికి అనేక నెలల కాలం పట్టింది. తయారీకి ఎంతకాలం పట్టినా వైవిధ్యంగల విగ్రహాల్ని తయారుచేస్తున్నా ననీ.. అవి అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించగలవనే భావనే నన్ను ఆ రంగంలో మరింత లోతుకు తీసికెెళ్లింది. ఒక సింహం, గుర్రమే కాదు. అన్ని రకాల జంతువుల విగ్రహాలూ తయారు చేశా. ఐరన్‌ బాల్స్‌ తోనూ, బోల్టులు, నట్లు, చైన్లు, మెష్‌లు ఇలా అన్నిటినీ ఉపయోగించి విగ్రహాలు చేశా. ఒక్కో బొమ్మకు దాదాపు 200 కిలోల స్క్రాప్‌ పట్టేది. వేల సంఖ్యలో వెల్డింగ్‌లు పెట్టాల్సి వచ్చేది. ఓ టన్ను స్క్రాప్‌ కొంటే అందులో పనికొచ్చేది సగం కూడా ఉండేది కాదు. పనికొచ్చే పార్టులు మాత్రమే తీసుకొని తయారు చేయాల్సి వచ్చేది. అదీ నెలల తరబడి. 
హైదరాబాద్‌ పర్యావరణ సదస్సులో ప్రదర్శనకు పెట్టిన విగ్రహాల్లో సింహం విగ్రహాన్ని ఓల్సన్‌ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఈ మార్కెట్లోకి ప్రవేశించడం తేలికే అనిపించింది. బెంగుళూరులో ప్రదర్శన నిర్వహించినప్పుడు రాయల్‌ ఒరాకిల్‌ కంపెనీ వారు ఐరన్‌ స్క్రాప్‌ విగ్రహాలను కొనుగోలు చేశారు. ఆ తరువాత గుంటూరు జిల్లా అమరావతిలో 'కాలచక్ర' జరిగినప్పుడు ప్రదర్శన ఏర్పాటు చేశా అక్కడకు అనేక మంది విదేశీయలు వస్తారని. అక్కడ ఖాట్మండ్‌కు చెందిన పెంగ్విన్‌ బుక్‌షాపు వారు స్క్రాప్‌తో తయారుచేసిన ఓ పాప విగ్రహాన్ని కొనుగోలు చేశారు. మెల్లగా మార్కెటింగ్‌ పెరుగుతుండడంతో దేవాలయాలు, గాలి గోపురాలు, వాటిపై విగ్రహాల తయారీ నిలిపివేశాను. మైనపు విగ్రహాలన్నీ తయారుచేయాలనిపించింది. లండన్‌లోని మేడమ్‌ టుస్సాట్స్‌ మ్యూజియంలో మాదిరి విగ్రహాలవైపు నా దృష్టి మళ్లినా మనది ఉష్ట ప్రాంతం. అలాంటి విగ్రహాలు ఎక్కువ రోజులు నిలవవు. కొన్ని చేసినా అవి స్థానికంగా ఎగ్జిబిషన్‌కే పరిమితం చేశా. వైవిధ్య శిల్పకళలో ఈ 30 ఏళ్లలో ఎందరో సత్కారాలు పొందాను. ప్రస్తుతం మా అబ్బాయీ విగ్రహాల తయారీలో కొత్తపుంతలు తొక్కుతున్నాడు. చివరిగా ఓ మాట చెప్పాలి. ఈ రంగంలోకి దళారులు ప్రవేశించి, కళాకారులుగా చలామణీ అవుతున్నారు. వీరు విగ్రహాల్ని 'డై'లుగా తయారు చేసి పోత పోస్తు న్నారు. దీంతో వాస్తవ కళాకారుడు తీర్చిదిద్దిన బొమ్మ నెలలు పడితే ఈ 'డై'ల మీద కొద్దిరోజుల్లోనే విగ్రహాలు తయారవుతున్నాయి. వీటిని అమ్మి వీరు కోట్లు గడిస్తు న్నారు. ఇది శిల్పకళకు అవమానమని నా భావన. 
భవిష్యత్తు పైనే నా దృష్టి: శిల్పి రవిచంద్ర
వారసత్వంగా నాకూ ఈ కళ అబ్బింది. మా వంశంలో ఎవరూ చదువుకోలేదు. నేను చదువుకొని ఈ రంగంలో మరింత ప్రయోగాలు, పరిశోధనలూ చేయాలనే సంకల్పం పెట్టుకున్నాను. అందుకే నేను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.టి.యు) నుంచి ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, కోల్‌కతాలోని గవర్నమెంట్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ నుంచి 'బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌' అవార్డు అందుకున్నాను. 2007-9 సంవత్సరాలకు ఉత్తమ విద్యార్థి అవార్డు పొంది, బంగారు పతకం అందుకున్నాను. అలాగే కొల్‌కతా యూని వర్సిటీలో చదివేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ నుంచి అవార్డుతోపాటు బంగారు పతకం పొందాను. నాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య నుంచీ, బెంగాల్‌లో ప్రముఖ రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ నుంచీ అవార్డులు, పురస్కారాలు పొందాను.
నాన్న పర్యవేక్షణలో శిల్పకళలో మెళకువలు నేర్చుకుంటూ జెఎన్‌టియులో మరింత మెరుగులు దిద్దుకున్నా. ఒక్క శిల్పకళకే ఎందుకు పరిమితమవ్వాలని నేను పెయింటింగ్స్‌ కూడా మొదలెట్టాను. మొదట బుద్ధుని చరిత్రపై ఎనిమిది పెయిం టింగ్స్‌ వేసి, అమరావతిలో జరిగిన 'కాలచక్ర-2006'లో ప్రదర్శించా. తరువాత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, డాక్టర్‌ కె.ఎల్‌. రావు విగ్రహాలను తయారు చేశా. తీవ్రవాద ఇతివృత్తంగా కొన్ని విగ్రహాలు తయారుచేశాను. ఢిల్లీలో ఇండియన్‌ నేషనల్‌ ఫోరం ఆఫ్‌ ఆర్ట్స్‌ Êకల్చరల్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు దేశం మొత్తంమీద 98 మంది శిల్పకారుల శిల్పాలు ఎంపికయ్యాయి. రాష్ట్రం నుంచి నా శిల్పానికి ప్రదర్శ నార్హత లభించింది. బాపట్లలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో ప్రతిష్ఠించేందుకు ఉద్దేశించి.. మహనీయులు, శాస్త్రవేత్తల శిల్పాలు తయారుచేశాను. వాటిలో కారల్‌ మార్క్స్‌, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, గెలీలియో, డార్విన్‌, మెండెల్‌ లామార్క్‌, హెపో కెట్‌, కెప్లర్‌, నికోలస్‌ కోపర్నికస్‌ ప్రధానమైనవి. ఈ విగ్రహాలన్నీ ఆవిష్క ృతమయ్యాయి. వాటిని పరిశీలించిన వారంతా ఎంతో మెచ్చుకున్నారు. భవిష్యత్తులో వైవిధ్యభరిత మైన కళాకృతులను నా చేతి మీదుగా ఆవిష్కరించగలనన్న నమ్మకం నాకెంతో ఉంది. 
Courtesy with: PRAJA SEKTHI DAILY

Sunday 12 January 2014

                         సత్యం కోసం నిలిచిన గెలీలియో


                సత్యం కోసం నిలిచిన గెలీ లియో జీవితచరిత్రను చదవాలి. సమాజాన్ని వెనక్కు నడపాలనుకునే మత ఛాందసుల దుర్మార్గాలను ఎది రించి నిలిచిన గెలీలియో ధన్యజీవి. విశాల విశ్వంలో భూమి యొక్క స్థానం గురించి అంతకు పూర్వం ఉన్న అభిప్రాయాలను, సిద్ధాంతాలను పటా పంచలు చేస్తూ కొత్త నిర్వచనాన్ని అందించిన విజ్ఞానశాస్త్ర పితా మహుడు గెలీలియో గెలిలి. టెలి స్కోపును అభివృద్ధి చేసి సుదూర అంతరిక్ష గ్రహరాశుల చలనాలను గుర్తి ంచి సమకాలీన ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టించాడు. అంతకు ముందు గుర్తించిన ఏడు గ్రహాలతో అంతరిక్షం పరిమితం కాలేదని, ఇతర గ్రహాలు కూడా ఉన్నాయని కను గొన్నాడు. విశ్వానికి కేంద్రం సూర్యు డని, భూమి కేంద్ర సిద్ధాంతాన్ని బద్దలు కొట్టాడు. ఇది ప్రకటించినందుకే తీవ్ర విమర్శలకు, కఠోర శిక్షలకు గురై గెలీలీయో అష్ట కష్టాలు పడ్డాడు. ఆనాడు ఇటలీ దేశ ప్రజల జీవిత సమస్త అంశాల మీద చర్చి ఆధిపత్యం కొనసాగుతుండేది. మత పెద్దలు జారీ చేసిన ఆజ్ఞలను తూచా తప్పక పాటించే పరిస్థితి. మత దుర హంకార మూఢా చారాలకు, శాస్త్రీయ దృక్పథానికి నడుమ భీకరమైన పోరు సాగింది. విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చిందన్న విషయమై బైబుల్‌ గాని, ఖురాన్‌ గాని, వేదాలుగాని వేటిలోనూ వాస్తవ సమాచారం లేదు. సమాజ యథాతథ స్థితిని కాపాడటం, ప్రజల్ని కటువైన జీవిత వాస్తవాలు చూడ కుండా చేయటం పాలకవర్గాలకు అవసరం. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే సమాజాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తారు. వర్గ సమాజంలో దోపిడీ తీవ్రతను మరుగు పరచటానికి మతం పాలకవర్గాల చేతిలో సాధనం.1600 సంవత్సరంలో భౌగోళ శాస్త్రజ్ఞుడైన 'బ్రూనో' సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసినందుకు మత పెద్దలు చర్చి కోర్టులో విచారణ చేసి కొయ్య స్తంభానికి పెడరెక్కలు విరిచికట్టి దహనం చేశారు.1564 ఫిబ్రవరి 15న ఇటలీలోని పీసా పట్టణంలో గెలీలియో జన్మిం చాడు. వైద్య విద్యార్థిగా ప్రారంభమై శాస్త్ర విజ్ఞానిగా మారాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కోపర్నికస్‌ చెప్పిన సిద్ధాంతాన్ని బల పరుస్తూ గెలీలియో ప్రజల వాడుక భాషలో రాసిన పుస్తకం మతశక్తులకు ఆగ్రహా వేశాలు కలిగించింది. 1611లో గెలీలియో రోమ్‌ వెళ్లినపుడు స్థానిక శాస్త్ర వేత్తలు అభినందనలతో ముం చెత్తారు. 1613లో 'లెటర్‌ ఆన్‌ ది సన్‌ స్పాట్స్‌' పుస్తకం ద్వారా కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని బలపరిచాడు. దీనిపై మత గురువులు మండిపడ్డారు. గెలీలియో ప్రయోగాలు మత ధిక్క రణగా నిర్ధా రణకు వచ్చి, 'మత ద్రోహ విచారణ'కు గెలీలియోను గురి చేయాలని మత పెద్దలు నిర్ణయి ంచారు. గెలీలియో రాసిన గ్రంథా లన్నిటినీ నిషే ధించారు. జీవితకాల శిక్ష విధిం చారు. 70 ఏళ్ళ వృద్ధాప్యంలో గెలీలియో ఈ శిక్షకు గుర య్యాడు. చివరి దశలో 'డూ న్యూసైన్సెస్‌' గ్రం థాన్ని నిర్బం ధంలోనే పూర్తి చేసి, ప్రొటెస్టెంట్‌ల ప్రాబల్యమున్న హాలె ండ్‌లో ప్రచురిం పజేశారు. సుదీర్ఘ కాలం ఆకాశాన్ని పరిశీ లించ డం తోనూ, గ్రంథ రచన చేయ టంతోనూ కంటి చూపు మంద గించింది. గృహ నిర్బంధంలోనే ఆయన అంధుడుగా మారాడు. అస్వస్థుడుగా మూడు నెలలు మంచంలో ఉండి 1642 జనవరి 8న తన 78వ ఏట మరణించాడు.

Courtesy with: Praja sekthi Dialy

Thursday 9 January 2014

విదేశీ విహంగాల విడిది నేలపట్టు


- నేటి నుంచి 'ఫ్లెమింగో ఫెస్టివల్‌'
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పులికాట్‌ సరస్సు మరోసారి విదేశీ విహంగాలకు విడిదిగా మారింది. పక్షుల కిలకిలారావాలతో పులికాట్‌ తీరం అలరిస్తోంది. విదేశీ విహంగాల రాక మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. పగలు పూర్తిగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్‌ తీరంలో ఆహారం తీసుకొని, రాత్రి సమయంలో దొరవారిసత్రం నేలపట్టు వద్ద విశాత్రి తీసుకుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ విహంగాలను వీక్షించేందుకు సరస్సుకు ప్రతి నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. 
నిజానికి, ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల క్రితం పులికాట్‌ సరస్సు, దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు చెరువులను పక్షుల కేంద్రాలుగా ప్రకటించింది. ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా 150 రకాల పక్షులు వచ్చి సరస్సు ఒడ్డున సేద తీరుతుంటాయి. ఈ సీజన్‌లో పక్షులు చేసే పలురకాల విన్యాసాలు, కేరింతలను చూసిన పర్యాటకుల మనస్సు పులకరించి పోతుంటుంది. ఈ పులికాట్‌ సరస్సులో మత్స్య సంపద విరివిగా దొరుకుతుండడంతో విదేశీ విహంగాలు తెల్లవారుజాము నుంచే నదిలో ఆహారం తీసుకుంటూ సాయంత్రం గూటికి వెళ్లే సమయంలో తమ సంతానానికి కొంత ఆహారం తీసుకువెళుతుంటాయి. విహంగాలు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి, తమ సంతానాన్ని పెంపొందించుకుని, తిరిగి మార్చి నెలాఖరులో తమ దేశాలకు పయనమవుతుంటాయి.
దేవతా పక్షులు...ప్రజలే రక్షకులు
పులికాట్‌ సరస్సు, నేలపట్టు చెరువులు మాత్రమే కాకుండా ఇక్కడకు సమీపంలో ఉన్న వెదురుపట్టు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెటూళ్లలో తిరుగాడుతుండడంతో ఆ ప్రాంతాల ప్రజలు వీటిని 'దేవతా పక్షులు'గా ఆరాధిస్తారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా రక్షించుకుంటారు. ఆ పక్షుల రాక మొదలైతే వర్షాలు వస్తాయనిగ్రామాల్లోని రైతులకు నమ్మకం. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని ప్రత్యేకంగా చూస్తారు. ప్రభుత్వం వీటి రక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. సాయంత్రం వరకు తమ పంట పొలాల్లో కాయకష్టం చేసుకునే రైతులు ఈ పక్షులను చూస్తూ, తాము చేసిన కష్టం మరచిపోతారు.
మత్స్యకారులకు నేస్తాలు 
పులికాట్‌ సరస్సులో తెరచాపలతో తిప్పలుపడుతూ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు ఈ పక్షుల విన్యాసాలు చూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుందని మత్స్యకార్మికులు చెబుతుంటారు. తమతో పాటు ఆహారపు వేటలో ఉన్న ఈ పక్షులు తమ నేస్తాలని వారంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఆహారం కోసం మన ప్రాంతానికి వచ్చి పర్యాటకులను ఆనందింపజేస్తున్న విహంగాలను వీక్షించేందుకు నేలపట్టు, పులికాట్‌ తీరానికి రావాల్సిందే!
ప్రతి జనవరిలో ఫెస్టివల్‌
దేశ విదేశాల నుంచి వస్తున్న విహంగాలను దృష్టిలో పెట్టుకుపని మన రాష్ట్రం ప్రతి ఏటా జనవరిలో వీటి పేరుతో పండుగలను సూళ్లూరుపేటలో నిర్వహిస్తోంది. 2001లో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ 'ఫ్లెమింగో ఫెస్టివల్‌'ను ప్రారంభించారు. కాగా, 2012లో ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టూరిజం క్యాలెండర్‌లో చేర్చింది. దీంతో ఈ శుక్ర, శనివారాలు రెండు రోజులుపాటు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. 

Courtesy with: PRAJA SEKTHI DIALY

Tuesday 7 January 2014



                   భూ వాతావరణంలోకి ఒక పరిమితిని మించి వదలబడే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ వాయువు భూమి యొక్క     ఉష్ణోగ్రత పెరిగేందుకు కారణమవుతోంది. కార్బన్‌-డై-ఆక్సైడ్‌ మూలంగా ఇలా భూమి తాలూకూ ఉష్ణోగ్రత పెరగడాన్నే 'గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌' అని అంటారు.సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిలో (ఉష్ణం, కాంతి) అత్యధికభాగం భూ వాతావరణంలోకి చొచ్చుకొని వచ్చి భూమిని తాకితే, కొంతభాగం మాత్రం వాతావరణం పైపొరల నుంచే తిరిగి రోదసీలోకి పంపేయబడుతుంది. అదేవిధంగా, భూవాతావరణంలోకి వచ్చిన సౌరశక్తిలో కూడా కొంతభాగం తిరిగి రోదసిలోకి పంపేయబడితే, మిగతాది మాత్రం వాతావరణంలోనే ఉండి రాత్రి పూట మరీ దారుణంగా చల్లబడిపోకుండా భూమిని కాపాడుతుంది. వాతావరణంలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ పరిమాణం పెరిగినప్పుడు వాతావరణం నుంచి తిరిగి రోదసిలోకి పంపబడే సౌరశక్తి తగిన స్థాయిలో పోకుండా వాతావరణంలోనే ఉండిపోతుంది. దీని ఫలితంగా భూ వాతావరణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వేడిగా తయారవుతుంది. సరిగ్గా ఇలా జరగడాన్నే గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అని అంటున్నాము.
గడచిన కొన్ని దశాబ్ధాలుగా మన ప్రపంచంలో కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు, ఓడలు, ట్రక్కులు, మోటారు బైకులు వంటి వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వివిధ రకాల ఫ్యాక్టరీలు, పరిశ్రమలు అపారంగా పెరిగిపోయాయి. వాహనాలకు, ఫాక్టరీలకు, థర్మల్‌ పవర్‌ ఉత్పాదనకు ఇంధనంగా ప్రతిరోజూ కొన్ని వేల టన్నుల బొగ్గు, పెట్రోలియం వాడబడుతోంది. వీటన్నిటి ఫలితంగా గాలిలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ పరిమాణం ఏటికేటికీ పెరిగిపోతూ వస్తోంది. దీని మూలంగా భూమి తాలూకూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఎండలు, వానలు, చలుల తీరుతెన్నులు గతి తప్పి, అది అనేక ప్రాంతాల జీవనంపై విపరీత ప్రభావాన్ని చూపిస్తోంది. ఆర్కిటిక్‌, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు పెద్దఎత్తున కరిగి, సముద్ర మట్టాలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ఉన్న అనేక నగరాలతో సహా, వేలాది గ్రామాలు సముద్రంలో భాగంగా మారిపోతాయి. మనుషులతో సహా వివిధ ప్రాణుల మనుగడ దుర్భరంగా మారుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, గాలిలోకి వదలబడే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ సాధ్యమైనంత తగ్గేలా చేసేందుకు మనందరమూ పాటు పడవలసి ఉంటుంది.
Courtesy with: PRAJA SEKTHI DAILY 

Monday 6 January 2014


ఇస్రో క్రయో'జయం'


Posted on: Mon 06 Jan 03:52:47.080974 2014









5.1.2014, సాయంత్రం
4.42. :'ఇస్రో మరో విజయం సాధించింది. జన్మభూమి రుణం తీర్చుకున్నాం' అని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌                    ప్రకటించారు. 
4.40. :నిర్దేశిత మార్గంలో ఆకాశంలోకి దూసుకుపోయిన జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌, సమాచార ఉపగ్రహం                         జిశాట్‌-14ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
4. 25. :విజయవంతంగా పనిచేస్తున్న క్రయోజనిక్‌ ఇంజన్‌
4. 22. :ఉపగ్రహం విడిపోవడంతో రెండోదశ సక్సెస్‌
4. 21. : రెండో దశ పయనం ఆరంభం
4. 18. :జిఎల్‌ఎల్‌వి-డి5 ప్రయోగం
4. 11. :ప్రయోగ ప్రక్రియ ప్రారంభం
3. 24. :క్రయోజనిక్‌ ఇంజన్‌లో ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి
11.15:ప్రయోగానికి సర్వం సిద్ధం
4.1.2014:ఉదయం :
                                11.18 జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం
 
                   రెండు దశాబ్దాల ఇస్రో కల సాకారమైన వేళ... భారత్‌కు ఇది సాధ్యమా అని ప్రపంచ దేశాలు సందేహిస్తున్న వేళ... అనేక వైఫల్యాలను అధిగమించి ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్‌ ఇంజన్లతో విజయవంతంగా జిఎస్‌ఎల్‌వి-డి5 నింగికెగసిన వేళ... ప్రపంచ దేశాల సరసన విజయగర్వంతో ఇస్రో తలెత్తుకు నిలబడింది. ఒక్కో అడుగు ముందుకేస్తున్న ఇస్రో ఈ ప్రయోగంతో మరో మైలురాయిని దాటినట్లయింది. సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుండి విజయవంతంగా జిఎస్‌ఎల్‌వి-డి5 ద్వారా జిశాట్‌-14 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపింది. ఈ విజయంతో ఇస్రోలో నూతన ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కొత్త ఏడాదిలో చారిత్రాత్మక విజయం సాధించడంతో దేశమంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

- జిఎస్‌ఎల్‌వి-డి5 సక్సెస్‌ 
- 20 ఏళ్ల కల సాకారం
- ఇస్రోలో నూతనోత్సాహాలు
ఆరు దేశాలకే పరిజ్ఞానం
                                    భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలో కొద్ది దేశాలకే పరిమితమైన క్రయోజనిక్‌ ఇంజన్ల తయారీలో భారత్‌ కూడా చేరింది. దాదాపు 20 ఏళ్ల నుండి సుదీర్ఘ కృషి ఫలితంగా ఇస్రో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) ఆదివారం మధ్యాహ్నం ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. సాయంత్రం 4.18 నిమిషాలు. శాస్త్రవేత్తల్లోనూ, వీక్షకుల్లోనూ, ఇస్రో కుటుంబంలోనూ ఒకటే ఉత్కంఠ. గతేడాది ఆగస్టు 19న జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌ ప్రయోగ సమయంలో రెండో దశలో ఇంధనం లీకవడంతో ప్రయోగం నిలిచిపోయిన విషయం తెలిసిందే. నాలుగున్నర నెలలపాటు లోపాలను సరిచేసి పున:ప్రయోగానికి సిద్ధమైన సమయంలో విజయం సాధిస్తామా అనే ఉత్కంఠ. శనివారం ఉదయం 11.18 నిముషాలకు ప్రారంభమైన 29 గంటల కౌంట్‌డౌన్‌ సమయం ముగిసింది. అందరిలోనూ ఉత్కంఠ. షార్‌ మొత్తం నిశబ్దం. మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల్లో ఒకింత ఆందోళన. కౌంట్‌డౌన్‌ సమయం ముగిసింది. 8, 7, 6, 5, 4, 3, 2, 1, +1, +2, +3, +4, +5, +6, +7, +8, అంటుండగానే షార్‌లోని రెండో ప్రయోగ కేంద్రం నుండి జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అందరి హర్షధ్వానాల మధ్య నింగిలోకి దూసుకుపోయింది. అత్యంత కీలకమైన రెండో దశలో భారత్‌ సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్‌ స్టేజీ ఉంది. సరిగ్గా 4.18 నిముషాలకు బయల్దేరిన రాకెట్‌ విజయవంతంగా కక్ష్యవైపు సాగింది. మొదటి దశలో రాకెట్‌ సెకన్‌కు 2.4 కిలోమీటర్లు ప్రయాణించింది. రెండో దశ డిఎస్‌2లో సెకనుకు 2.5 కిలో మీటర్ల వేగం అందుకుంది. మూడో దశలో సెకనుకు 19.78 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంది. దాదాపు 12 నిముషాల పాటు మూడో దశ కొనసాగింది. భూమికి దగ్గరగా 179 కిలోమీటర్లు, భూమికి దూరంగా 35,950 కిలో మీటర్ల మధ్యంతర భూ స్థిర కక్ష్యలో 1,982 కేజీల బరువున్న జిశాట్‌-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ జిశాట్‌-14 పన్నెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అనంతరం కర్నాటకలోని హసన్‌ వద్ద నెలకొల్పబడిన ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తూ ఉపగ్రహంలో ఉన్న ద్రవ ఇంధనాన్ని మండిస్తూ 36 వేల కిలోమీటర్ల వృత్తాకార భూ స్థిర కక్ష్యలో 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉపగ్రహాన్ని స్థిరపరిచారు. భూమి నుండి బయల్దేరిన తరువాత 17 నిముషాలా 7 సెకన్లకు ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా షార్‌లో ఆనందం వెల్లివిరిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజన్ల ద్వారా జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగం విజయవంతమవడంతో అప్పటి వరకూ ఉత్కంఠగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చంద్రయాన్‌ ప్రయోగ సమయంలో, అంగారక ఉపగ్రహ ప్రయోగ సమయంలోనూ ఇంతటి ఉత్కంఠ కన్పించలేదు. ఎన్నో ఏళ్లు కలగా ఉన్న ఈ ప్రయోగం విజయవంతమవడంతో షార్‌ శాస్త్రవేత్తల, ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో కుటుంబ విజయమని అభివర్ణించారు. ప్రయోగాన్ని వీక్షించిన వారిలో విక్రమసారాబాయి స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామకృష్ణన్‌, జిఎస్‌ఎల్‌వి ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ నారాయణరావు, డాక్టర్‌ చంద్రదత్తన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, తదితరులున్నారు.
Courtesy with PRAJA SEKTHI DIALY
క్రయోజనిక్‌ అంటే?
Posted on: Mon 06 Jan 03:23:58.307936 2014

                       క్రయోజనిక్‌ ఇంజన్‌తో కూడిన జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగం విజయం భారత్‌ను ఆరు అగ్రదేశాల సరసన నిలిపి ప్రతీ భారతీ యుడినీ సంతోషసాగరంలో ముంచెత్తింది. ఈ ఇంజన్‌కోసం భారత శాస్త్రవేత్తలు చేసిన కృషి అనన్యసామాన్యమైనది. 20 సంవత్సరాల పాటు అదేపనిగా అహోరాత్రాలు శ్రమించారు. ఎప్పటికప్పుడు గమ్యానికి చేరుకున్నట్టు అనిపించడం, అంతలోనే ఎదరయ్యే అవరోధంతో తలపట్టుకోవడం ... ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. గత ఏడాది ఆగస్టులో ప్రయోగానికి అంతా సిద్దమైనా, చివరి క్షణంలో లోపాలు ప్రత్యక్షమైనాయి. కీలకమైన క్రయోజనిక్‌ విభాగంలో లీకేజి కనపడటంతో అప్పట్లో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఇంత జరిగినా శాస్త్రవేత్తలు అలసిపోలేదు. ఏ దశలోనూ కుంగిపోలేదు. వైఫల్యాల నుండి నేర్చుకుంటూ నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్ష వీధుల్లో భారత జెండాను ఎగరవేశారు. ఇప్పటికే ఈ సాంకేతికను అందిపుచ్చుకున్న అమెరికా, చైనా, రష్యా జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌ ల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపారు.
తక్కువ ఉష్ణోగ్రత... తక్కువ ఇంధనం... ఇదే క్రయోజనిక్‌ పనితనం
అంతరిక్ష ప్రయోగాల్లో శాస్త్రవేత్తలను నిరంతరం వేధించే సమస్య విపరీతమైన ఉష్టం. సాధారణ టూ వీలర్‌ను ఎక్కువ సేపు నడిపితే ఇంజన్‌ వేడిక్కి మొరాయించడం మనకు అనుభవమే. అదే నిప్పులు చిమ్ముకుంటూ నింగికిఎగిరే అంతరిక్ష వాహనాల్లో వెలువడే ఉష్ణాన్ని ఒక్క సారి ఊహించండి. భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించిన తరువాత దీని తీవ్రత మరింత పెరుగుతుంది. సాధారణ ప్రజానీకం ఊహించలేని ఉష్టం వెలువడుతుంది. దీని నుండి రాకెట్‌ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్‌. ఉష్ణొగ్రత పెరిగే కొద్ది ఇంధన వినియోగం కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఈ రెండు పరిస్థితులను అధిగమించేదే క్రయోజనిక్‌ పరిజ్ఞానం. అత్యంత తీవ్రంగా వెలువడు తున్న ఉష్ణోగ్రతను నియంత్రించి అత్యంత శీతలంగా ఉంచడమే క్రయోజనిక్‌ ప్రత్యేకత. మరో మాటలో చెప్పాలంటే బయట మండే ఎండ ఉన్నప్పటికీ ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితిని అంతరిక్షం వాహనంలో సృష్టిం చడం. ఇది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. కన్ను మూసి తెరిచేలోగా కొన్ని వేల కిలో మీటర్ల దూరాన్ని అగ్నిజ్వాలలు చిమ్ము కుంటూ వెళ్తున్న వాహనంలో, అదీ అంతరిక్షంలో దీనిని సాధించాలి! ఉపగ్రహాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు, అతి తక్కువ ఇంధనాన్ని వినియోగించాలి. మరింత వేగాన్ని అందుకోవాలి. ఈ మూడు లక్ష్యాలను తాజా ప్రయోగంలో శాస్త్రవేత్తలు సాధించారు. ఈ లక్ష్యసాధనలో ఎదుర్కొన్న కష్టాలను అంతిమ విజయపు ఆనందంలో మరచిపోయారు.
సోషలిస్టు రష్యా సహకారంతో ...!
క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని భారతదేశం సాధించడంలో ఒకప్పటి సోషలిస్టు రష్యా సహకారం కూడా ఎంతగానో ఉంది. అంతరిక్ష ప్రయోగాలు ప్రారంభించిన తొలిదశలోనే భారతదేశం ఆ పరిజ్ఞానం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటికే ఆ తరహా పరిజ్ఞానాన్ని అందుకున్న దేశాలను అభ్యర్ధించింది. అప్పటికే ఆ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న అమెరికా, జపాన్‌, జర్మనీ, ష్రాన్స్‌ల నుండి తిరస్కారం ఎదురైంది. పరిజ్ఞానాన్నికాదు కదా... తాము రూపొందించిన క్రయోజనిక్‌ యంత్రాలను ఇవ్వడానికి కూడా ఆ దేశాలు నిరా కరించాయి. ఈ దశలో సోషలిస్టు రష్యా భారత్‌కు సహకారాన్ని అందించింది. ఇప్పటి దాకా భారతదేశం చేసిన 5 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు ఆ దేశమే క్రయోజనిక్‌ ఇంజన్‌లను సమకూర్చింది. 1990 వ దశాబ్ధంలో ఆ పరిజ్ఞానాన్ని స్వయంగా రూపొందించడంపై భారత శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భారత్‌ ఈ దిశలో ప్రయోగాలు చేస్తున్న సమయంలోనే చైనా ఆ పరిజ్ఞానాన్ని అందుకుంది.

Courtesy wirh : PRAJA SEKTHI DIALY