Tuesday 22 October 2013

పొగాకు నుంచి జీవ ఇంధనాలు..!


     జన్యుమార్పిడి చేసిన పొగాకు మొక్కల ద్వారా జీవ ఇంధనాలను (బయోఫ్యూయెల్‌) తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. 'థియోరెడాక్సిన్‌' అనే ప్రొటీన్‌ ద్వారా ఇది సాధ్యమవుతుందని వారు తొలిసారిగా వెల్లడించారు. ఈ ప్రొటీన్‌ వల్ల పొగాకుమొక్కలో పిండి పదార్థం మోతాదుపెరుగుతుందని తెలిపారు. నావరె విశ్బవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు జరిపారు. థియోరెడాక్సిన్‌ ప్రొటీన్‌లో ఎఫ్‌.ఎం. అనే రెండు రకాలుంటాయని, అవి రెండూ ఒకే విధంగా పనిచేస్తాయని ఇప్పటివరకూ భావించేవాళ్లమని... కానీ, తమ పరిశోధన ద్వారా వాటి పనితీరు భిన్నంగా ఉన్నట్లుందని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొటీన్‌ల గురించి తెలిసిన నూతన విషయాల ద్వారా పొగాకు మొక్కల్లో జన్యుమార్పిడి చేసి.. 500 శాతం అధికంగా చక్కెర పదార్థాలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ చక్కెర పదార్థాలను బయో ఎథనాల్‌గా మార్చటంలో విజయం సాధించారు. ఒక టన్ను జన్యుమార్పిడి పొగాకు ఆకుల నుంచి 40 లీటర్ల బయో ఎథనాల్‌ను రూపొందించవచ్చని వారు చెబుతున్నారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment