Wednesday 10 July 2013

ఆకలి లేకపోతే...

 
 
             ఆకలి లేకపోవడమన్నది అనేక కారణాల వల్ల జరుగుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాక పోవడం, అజీర్తి చేయడం, ఆహారం తీసుకున్న వెంటనే చిరుతిళ్లను తినడం, తీపి పదార్థాలను అతిగా తినడం, నిద్ర లేమి, ఆహార నియమా లను పాటించకపోవడం, మానసిక వ్యాకు లత, జలుబుతో బాధపడేటప్పుడు, అనా రోగ్యాలు కలిగినప్పుడు ఇలాంటి అనేక కారణాలు ఆకలి మందగించేలా చేస్తాయి.
ఆకలి లేదని ఆహారం తీసుకోక పోతే పని చేయడానికి కావలసినంత శక్తి లభించదు. శక్తి తగినంత లేకుండా పనులు చేయడం వల్ల బలహీనతకు గురవుతారు. ఉత్సాహంగా, చురుకుగా పని చేయలేకపోతారు. అందువల్ల, ఆకలి లేనప్పుడు ఆకలి కలిగేందుకు, జీర్ణక్రియ సవ్యంగా జరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకలి కావడానికి ఏ పద్ధతులను పాటించాలో ముందుగా తెలుసుకోవాలి.
1. విరేచనాలు అయ్యేందుకు మందు వేసుకుని ఉదరాన్ని శుద్ధి చేసుకోవాలి.
2. ఆహారంలో మసాలా దినుసులు, వేపుడు కూరలు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం మానేసెయ్యాలి.
3. ఆహార నియమాలను పాటించాలి.
4. ద్రవ పదార్థాలను, పళ్ల రసాలను తీసుకోవాలి. కాఫీ, టీ లాంటి పానీయాలను అధికంగా త్రాగడం మానేసెయ్యాలి.
5. తేలికగా జీర్ణమయ్యే కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. దోసకాయ, క్యాబేజీ, క్యారెట్‌, బీర, పొట్ల, సొర, బెండకాయ, ముల్లంగి లాంటి కూరగాయలను తాజా ఆకుకూరలను మెత్తగా ఉడికించి తినాలి.
6. జీర్ణశక్తిని పెంచేందుకు వాము కానీ, శొంఠి పొడి కానీ మెత్తగా దంచి, అందులో తగినంత ఉప్పు పొడిని కలిపి, అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని తింటే ఆకలి పెరుగుతుంది.
7. దానిమ్మ, మామిడి, రేగుపండు లాంటివి ఆకలిని పెంచేలా చేస్తాయి.
8. సెనగపిండి, దుంపకూరలు, తీపి పదార్థాలు, నూనె పదార్థాలు, అతిగా చిరుతిళ్లు తినడం మానెయ్యాలి.
9. రోజుకు రెండు లీటర్ల పరిశ్రుభమైన మంచినీటిని తాగాలి.
10. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మరమరాలతో ఉప్మా చేసుకుని తినడం మంచిది.
11. పరిశుభ్రంగా తయారు చేసిన ఆహార పదార్థాలను వేడిగా ఉన్నప్పుడే తినాలి.
12. అల్లం, ధనియాలు, జీలకర్రలను ఆహార పదార్థాల తయారీలో చేర్చాలి.
13. కందిపప్పు లేదా పెసరపప్పును వేయించి, ఆ తర్వాత ఉడికించాలి.
14. పీచు లభించే పదార్థాలను తీసుకోవాలి.
15. ఆహారం తీసుకుని శరీరానికి శ్రమ కలి గించకుండా విశ్రాంతిగా ఉండకూడదు. ఆహారం ద్వారా లభించే శక్తిని శరీరశ్రమతో వినియోగించాలి.
16. ఆకలి లేదని ఆహారం తీసుకోవడం మానెయ్యకూడదు. సగ్గుబియ్యం జావ, పళ్ల రసాల లాంటివి తీసుకోవాలి.
17. తీసుకొనే ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తపడాలి.
18. విందులు, పండగ సందర్భాల్లో అతిగా ఆహారం తీసుకున్నప్పుడు, మర్నాడు ద్రవ పదార్థాలతో, తేలికగా జీర్ణమయ్యే ఫలహారంతో లేదా పళ్లతో సరిపెట్టుకోవాలి.
19. అతిగా ఉపవాసాలుండడం కానీ, అతిగా తినడం కానీ జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవాలి.
- కె. నిర్మల 

Courtesy with : Praja Sekthi

No comments:

Post a Comment