Monday 1 April 2013

గురుత్వాకర్షణను లెక్కచేయని గింజ


           ఒక అడుగు పొడవుగల దారాన్ని తీసుకోవాలి. ఒక కొనకు వేరుశనగ గింజను కట్టాలి. టేబుల్ అంచుకు రెండవ కొనను టేపు సహాయంతో అతికించాలి. అంచునుండి వేలాడదీసిన దారం రెండవ కొననుండి గింజ కింది వైపు వేలాడుతూ ఉంటుంది.
ఒక రబ్బరు బెలూన్‌ను గాలితో ఊదిన దానిని తీసుకోవాలి. దానిని ఉన్ని లేదా ఊలు లేదా మీ తలమీద గల పొడి జుట్టుతో రుద్దాలి. ఇప్పుడు బెలూన్ విద్యుదావేశితం కాబడుతుంది. దానిని వేరుశనగ గింజవద్దకు తీసుకురావాలి.
వేరుశనగ గింజను బెలూన్ ఆకర్షిస్తుంది. అయితే ఈ రెండూ కలవకుండా ఉండే విధంగా బెలూన్‌ను తగినంత దూరంలో ఉంచాలి. ఆ రెండూ కలిస్తే అనవసరంగా వాటి నడుమ విద్యుదావేశం బదిలీ అవుతుంది. ఇప్పుడు బెలూన్‌ను పైకి ఎత్తుతూ తీసుకువెళ్లాలి. వేరుశనగ గింజ కూడా బెలూన్‌తోపాటు గురుత్వాకర్షణను లెక్కచేయకుండా పైకిలేస్తుంది.
వేరుశనగ గింజ తటస్థ విద్యుదావేశం కల్గినది. అంటే దానిలో ధన, ఋణ విద్యుదావేశాలు సమంగా విస్తరించబడి ఉంటాయి. దీని దగ్గరకు ఋణ విద్యుదావేశంగావించబడిన రబ్బరు బెలూన్ తీసుకురాబడినది. ఇది వేరుశనగ గింజలోని ధనావేశాలను బెలూన్ వున్న వైపు ఆకర్షిస్తుంది. ఈ రెండు వ్యతిరేక విద్యుదావేశాలు ఆకర్షించుకుంటాయి.
వేరుశనగ గింజ, దానిని వేలాడ దీసిన దారం తేలిగ్గా ఉండడం వలన బెలూన్, గింజల నడుమ ఆకర్షణబలం ఇటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది.

Courtesy With: Andhra Bhumi

No comments:

Post a Comment