Wednesday 18 July 2012

అత్యంత బరువు తక్కువ పదార్థం...!


            జర్మనీలోని పరిశోధకులు ప్రపంచంలో అత్యంత బరువు తక్కువ పదార్థాన్ని రూపొందించారు. ఎరోగ్రాఫైట్‌ అనబడే ఈ కొత్త పదార్థం బోలుగా ఉండే కర్బన గొట్టాల కలయిక. ఇలా తయారైన పదార్థపు బరువు, ఒక ఘనపు సెంటీమీటర్‌కి కేవలం 0.2 మిల్లీగ్రాములు! ఇది 99.99 శాతం గాలే అయినా విద్యుత్‌ని సమర్థవంతంగా ప్రసారం చేస్తుంది. ఈ లక్షణం వలన దీనిని సూపర్‌ తేలిక బాటరీల తయారీలో వాడే అవకాశం మెండుగా ఉంది. ఈ పదార్థం చూడటానికి స్పాంజ్‌లా ఉంటుంది. దీనిని దాని పరిమాణంలో వెయ్యో వంతుకి కుంచింపజేసినా తిరిగి యథారూపానికి వస్తుందట! పైగా ఇది తన బరువుకన్నా 40,000 రెట్లు బరువును మోయగలదు.

No comments:

Post a Comment