Wednesday 4 July 2012

గుట్టలు..


చిన్నా, పెద్ద గుట్టలు కూడా సూక్ష్మ స్థాయిలో వాతావర ణాన్ని, నేలల్ని, ఉత్పత్తి వ్యవస్థలను, సాంఘిక, ఆర్థిక జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
చిన్న గుట్టల పునాది చుట్టూతా భూగర్భ జలసంపద అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతపు నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉండి, బంకమట్టి శాతం తక్కువగా ఉంటుంది. కొంత వాలు తగ్గిన తర్వాత మైదాన ప్రాంతం వస్తుంది. మైదాన ప్రాంతం పైర్ల పెరుగుదలకు అనువుగా ఉంటుంది. లోయ ప్రాంతపు నేలల్లో బంక మట్టి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండవచ్చు. ఎత్తుపల్లాలు వాలు కూడా ఈ విధంగానే ప్రభావితం చేస్తున్నాయి. వంపులో చేరే నీరును చెరువులు లేదా పెద్ద కట్టడాలను నిర్మించి, నీటిని నిల్వ చేసి వినియోగించుకోవచ్చు. సంస్కృతి పరంగా మానవులు లోయల్లోనూ స్థిర నివాసాలు ఏర్పరచుకొని, జీవనాన్ని కొనసాగించారు.
పెద్ద గుట్టలపై అడువులు సహజంగానే ఉన్నాయి. ఇవి అధిక వర్షపాతానికి కూడా దోహదపడుతున్నాయి. ఈ అడవులు, అధిక వర్షపాతం, అనుకూల ఉష్ణోగ్రత లు, నాణ్యమైన జీవనానికి తోడ్పడుతున్నాయి. ఇక మెత్తటి రాయితో ఏర్పడే గుట్టలు పైభాగంలో కూడా సారవంతమైన భూముల్ని, చల్లని వాతావరణాన్ని కలిగుంటాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. ఊటీలాంటి చోట్ల చురుకైన ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడుతున్నాయి.

No comments:

Post a Comment