Wednesday 18 July 2012

ఫ్లూటోకి ఐదో ఉపగ్రహం..!



            హబుల్‌ టెలిస్కోప్‌ మరో విశేషాన్ని గుర్తించింది. మరుగుజ్జు గ్రహంగా పిలిచే ఫ్లూటో చుట్టూ ఐదోచంద్రుడు ఉన్నట్టు గుర్తించింది. ఈ కొత్త చంద్రుడు పది నుండి 25 కిలోమీటర్ల వ్యాసంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఫ్లూటో అంతటి చిన్న గోళం చుట్టూ ఇన్ని ఉపగ్రహాలు ఉండటం విశేషమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇంతవరకు ఫ్లూటో చుట్టూ శారన్‌, నిక్స్‌, హైడ్ర, పి4 అనే ఉపగ్రహాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి తాజా ఉపగ్రహానికి పి5 అనే పేరు పెట్టారు. దీని చిత్రాలు ఈ రెండు నెలల్లో హబుల్‌ తీసింది. ప్రస్తుతం న్యూ హౌరైజాన్స్‌ అనే మానవ రహిత అంత రిక్ష నౌక ఫ్లూటో దరిదాపుల్లో ఉంది. మరో రెండు సంవత్సరాల్లో అది మరిన్ని వివరాలతో చిత్రాలను అందిస్తుందని ఆశిద్దాం..!

No comments:

Post a Comment