Monday 12 March 2012

మైక్రోస్కోప్



  • 12/03/2012
1665లో రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్‌ను తయారుచేశాడు. దాని కింద అతను సీసా బిరడాలకు వాడే కార్క్‌ను పరిశీలించాడు. ఆశ్చర్యంగా అతనికి కార్కులో (బెండులో) రంధ్రాలు కనిపించాయి. వాటిని అతను ‘సెల్స్’ అన్నాడు. 1878 తర్వాత పరిశోధకులు నిజంగా సెల్స్ అంటే కణాలను చూడగలిగారు! హుక్ గమనించింది ఈ సెల్స్‌నే అని అప్పుడు తెలిసింది.
ఆకాశంలోని ఒక నక్షత్ర సముదాయానికి మైక్రోస్కోపియం అని పేరుంది. మైక్రోస్కోపు అనే పరికరానికి గుర్తింపుగా ఈ పేరు పెట్టారు. లేకుంటే నక్షత్రాలకు, సూక్ష్మదర్శినికీ సంబంధమే లేదు.
మైక్రోస్కోపుల తయారీలో జర్మనీ, జపాన్, చైనా దేశాలది పైచేయి!
ఒకమంచి ఆప్టికల్ మైక్రోస్కోపులో రెండువందల నానోమీటర్లు (0.0000002) మీటర్ల వరకు వివరాలు కనబడతాయి.
అల్ట్రా మైక్రోస్కోపులో వివరాలు రెండు నానో మీటర్లు (0.000000002) వరకు కనబడతాయి.
మొదట్లో తయారయిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో పదార్థం పెరిగి కనబడాలంటే, దానిగుండా విద్యుత్ ప్రసరించాలి. అందుకే చూడదలచిన పదార్థం మీద పలచని కార్బన్ లేదా మిశ్రలోహం పొరను పరిచేవారు!

No comments:

Post a Comment