Tuesday 13 March 2012

తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక

మానవ శాస్త్రీయ చరిత్రలో మర్చిపోలేని రోజు అది. అక్టోబరు 4, 1957. ఆ సంవత్సరం అంతర్జాతీయ భూభౌతిక సంవత్సరంగా ప్రకటించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకు ని రష్యా దేశం 'స్పుత్నిక ప్రోగ్రాం'ను ప్రారంభించింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదటి మానవ నిర్మిత రోబో టిక ఉపగ్రహాన్ని ఆరోజున అంతరిక్షంలోకి పంపింది.
స్పుత్నికనుే అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఆర్‌-7 లాంచ్‌ వెహికిల్‌ను ఉపయోగించారు. ఆ వాహనాన్ని అంతకుముందు అణ్వాయుధాలను మోసుకు వెళ్లేందుకు వాడేవారు.
స్పుత్నిక చాలా చిన్న ఉపగ్రహం. అది 23 అంగుళాల గోళం. దాని బరువు 83.6 కిలోలు. అది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 96 నిమిషాలు పట్టేది. అది గంటకు 29.000 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అంతరిక్షం నుండి స్పుత్నిక రేడియో సంకేతాలను ప్రసారం చేసేది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెచూర్‌ రేడియో ఆపరేటర్లు స్పుత్నికనిే రేడియో సంకేతాల ద్వారా పసిగడ్తూ ఉండేవారు. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ స్పుత్నిక 22 రోజులు సంకేతాలను ప్రసారం చేసింది. అయితే అక్టోబరు 26న బ్యాటరీలు బలహీనపడ్డాయి.
ఎటువంటి సంకేతాలు పంపకుం డానే స్పుత్నిక 1958 జనవరి 4 వరకూ తిరుగుతూనే ఉంది. ఆ రోజున అది పరిభ్ర మణ మార్గం నుండి భూమిపైకి పడిపోతూ, భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపో యింది. స్పుత్నిక అంతరిక్షంలో మూడునెలలు గడిపి, 60మిలియన్‌కి.మీ.లు ప్రయాణించింది.
రష్యా ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహంతో ఆ దేశం సాధించిన విజయం అమెరికాకి మింగుడుపడలేదు. పంతంతో అమెరికా కూడా కృత్రిమ ఉపగ్రహాన్ని రూపొందించింది. స్పుత్నిక నేలరాలిన నెలలోనే అమెరికా తన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఎక్సప్లోరర్‌-1 అనే పేరుతో అమెరికన్‌ ఉపగ్రహం జనవరి 31, 1958; ఫిబ్రవరి 1న 3.48 గంటలకు (ఉదయం) అంతరిక్షంలోకి దూసుకుపోయింది. అయితే అంతకుముందు నెలలోనే ఉపగ్రహం పంపే ప్రయత్నంలో అమెరికా విఫలమైంది. ఎక్సప్లోరర్‌-1 భూమిచుట్టూ రేడియేషన్‌ పొరలున్నాయని సమాచారం అందించింది. బహుశ ఉపగ్రహాలు అందించిన తొలి శాస్త్రీయ సమాచారం అదే కాబోలు.
రష్యా మాత్రం అమెరికా కంటే ముందే మరో ఉపగ్రహాన్ని పంపింది. అదే స్పుత్నిక-2. నవంబరు 3, 1957న స్పుత్నిక 2 అంతరిక్షంలోకి వెళ్లడమే కాకుండా, లైకా అనే కుక్కని కూడా తీసుకెళ్లడం విశేషం. ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి ప్రత్యేక గదులున్నా లైకా ఎక్కువకాలం జీవించలేదు. దాదాపు పదిరోజు లైనా బతుకుతుందనుకున్న లైకా కొన్ని గంటలలోనే చనిపో యిందని అనుకున్నారు. స్పుత్నిక-2 అంతరిక్షంలో 162 రోజులు గడిపి, 1958, ఏప్రిల్‌ 14న నేలపైకి పడుతూ ధ్వంసమైంది.
- డాక్టర్‌ విజరు

No comments:

Post a Comment