Thursday 1 March 2012

రజతోత్సవ కార్యక్రమాలు...

రజతోత్సవ సంవత్సరం (2012-13) కాలంలో కార్యక్రమాల ద్వారా 'జన విజ్ఞాన వేదిక' నిలకడగా కాకుండా 'ఒక గెంతు' తీసుకుని ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కార్యక్రమాల్ని రూపొందించి, కృషి చేయాలని మహాసభ నిర్ణయించింది. ఆందోళనకు గురవుతున్న అన్ని వర్గాల ప్రజల దగ్గరకు చేరగలిగేలా ఈ కార్యక్రమాల్ని రూపొందించాలని నిర్ణయించింది. వీటిలో ముఖ్యమైనవి...
1. సమగ్రాభివృద్ధి కొరకు విజ్ఞానయాత్రలు
నవ కేరళ పద్ధతిలో పాద, సైకిల్‌, జీపు యాత్రలు.
2. భూమి ఉత్సవాలు
అభివృద్ధా, విధ్వంసమా?.. వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌, పర్యావరణం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రకృతి వనరుల దోపిడీ, నిర్వాసితుల సమస్యలు, ప్రపంచీకరణ పరిణామాలు వంటి అంశాలపై చర్చలు, ప్రదర్శనల ఏర్పాటు.
3. గ్రామాభివృద్ధిలో ప్రధానాంశాల గుర్తింపు, దీని ఆధారంగా ప్రణాళికలను రూపొందించడం.
గ్రామాభివృద్ధి కమిటీల ఏర్పాటు.
4. సైన్స్‌ ఎగ్జిబిషన్లు, జాతర్లు
వీటిలో సమాజ గమనాన్ని మార్చిన సైన్స్‌ ఆవిష్కరణలు, మానవ ప్రగతి, శాస్త్రీయ దృక్పథం, ఖగోళ విజ్ఞానం, టెలిస్కోపుల పరిణామక్రమం. జీవం అంటే..?, జన్యు సాంకేతికం, శరీర విజ్ఞానం, అణు విజ్ఞానం నుండి నానో టెక్నాలజీ వరకూ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు, సైన్స్‌ సరదాలు, అద్భుతాలు.. తదితర కార్యక్రమాల నిర్వహణ.
ఈ కార్యక్రమాల్లో భాగంగా చర్చించాల్సిన అంశాలు..
* ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రగతి - వృత్తిదారులు, సామాజిక తరగతులపై ప్రభావం.
* బిటి పంటలు పర్యవసానాలు - అణు విద్యుత్‌, ప్రత్యామ్నాయ శక్తి వనరులు.
* విద్యుదుత్పత్తి కేంద్రాల కేంద్రీకరణ... పర్యవసానాలు.
* సహజవనరులు-ప్రజల సంపద.
* సైన్స్‌ చిత్రాలు, పండుగలు.
* శాస్త్రవేత్తల లఘు చిత్రాలు.
* వివిధ ఆవిష్కరణలు.
* అంతరిక్ష విజ్ఞానం.
5. స్థానిక శాస్త్రవేత్తలు.. మేధావుల పండుగలు..
వివిధ రంగాలలో స్థానిక శాస్త్రవేత్తల్ని, ప్రముఖ నిపుణుల్ని గుర్తించి.. వారి స్మారక కార్యక్రమాల ఏర్పాటు. ఉదా: యర్రాప్రగడ సుబ్బారావు, జ్ఞానేంద్ర, వై.నాయుడమ్మ, ఎస్‌.ఆర్‌.శంకరన్‌, తదితరులు.
6. మాయలు.. మహిమల బండారం.. ప్రదర్శనలు
వీటిపై మ్యాజిక్‌ శిక్షణలు, ప్రదర్శనలు.
7. బాలోత్సవాలు, సృజనోత్సవాలు..
సరదాసరదా చదువుల పేరుతో మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలి.
8. ఆరోగ్య శిబిరాలు..
అంటురోగాలు ప్రబలే ప్రాంతాల్ని గుర్తించి, ఆరోగ్యశిబిరాల నిర్వహణ. ఫిట్స్‌ క్యాంపుల తరహాలో ఇతర వ్యాధుల గుర్తింపు, క్యాంపుల నిర్వహణ.
9. ఆరోగ్య చైతన్య ప్రదర్శనలు..
ఆరోగ్య శిబిరాల్లో చికిత్సను అందించడమే కాక, ఆయా రోగాలకు సంబంధించిన అంశాలతో ప్రదర్శన, పూర్తి సమాచారాన్ని అందించే ఏర్పాటు.
10. సమతా మహిళా విజ్ఞానోత్సవాలు..
జిల్లా, పట్టణ స్థాయిలో ఏర్పాటు.
నిర్వహణ..
ఈ కార్యక్రమాల్లో సైన్స్‌ నిపుణులు, కార్యకర్తలు, మధ్య తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజనులు మొదలైన వారిని భాగస్వామ్యం చేయాలి. వీలున్నచోటల్లా ప్రోత్సాహకుల్ని గుర్తించి, సహాయం తీసుకోవాలి. రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణకు శాస్త్రవేత్తలు, మేధావులు, ప్రజాప్రతి నిధులు, స్వాతంత్య్ర సమరయోధులు మొదలగువారితో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని మహాసభ నిర్ణయించింది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment